జాతీయ వార్తలు

అన్ని సంస్కృతులకు గౌరవం లభించినప్పుడే ప్రపంచం గుబాళిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 1: అన్ని సంస్కృతులు, వాటిలోని భిన్నత్వాలకు సమానమైన గౌరవం లభించినప్పుడే ప్రపంచం గుభాళిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూయిజం ఒక జీవన విధానమని ఆయన అన్నారు. బ్రిటన్‌లోని హార్ట్ఫోర్డ్‌షైర్‌లో ఛారిటీ హిందూ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించిన సంస్కృత్ మహా శిబిర్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ వసుధైవ కుటుంబకం అన్నది హిందుత్వ వౌలిక సూత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ‘బహుముఖీనమైన ప్రపంచంలో ప్రతి సంస్కృతికి గౌరవం లభించినప్పుడు విశ్వం ఆ విరులతో గుభాళిస్తుంది’ అని అన్నారు. హిందుత్వం అనేది అన్నింటినీ కలుపుకుని పోయేదే తప్ప వేరుగా ఒంటరిగా ఉండదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ గల జీవితంతో శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని, సరైన ఆహారం, అలవాట్లు, క్రమపద్ధతిలో వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుందని భాగవత్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూకె లోని రామకృష్ణ వేదాంత సెంటర్ చీఫ్ స్వామి దయాత్మానంద, సేవాశ్రమ్ సంఘ్ నిర్వాహకులు స్వామి నిర్లిప్తానంద తదితరులు పాల్గొన్నారు.