అంతర్జాతీయం

గ్రహ శకలాన్ని పేల్చేయడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, ఆగస్టు 1: అంతరిక్షంలో తిరుగాడుతున్న వ్యర్థాల కారణంగా పుడమికి ఎలాంటి ముప్పూ రాకుండా శాస్తవ్రేత్తలు ఓ వినూత్న ప్రయోగాన్ని చేశారు. భూమికి అతి సమీపంగా పరిభ్రమించే గ్రహ శకలాల కారణంగా ముప్పువాటిల్లే అవకాశం ఉండటంతో వాటిని తప్పించేందుకు ఈ ప్రయోగం ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అనేక గ్రహ శకలాలు భూమికి అతి సమీపంగా దూసుకుపోయిన నేపథ్యంలో జరిగిన ఈ ప్రయోగం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి గ్రహ శకలాలను అణు విస్పోటనాల ద్వారా పేల్చేయాలని భావిస్తున్నప్పటికీ అది ఎలా సాధ్యమన్నది అంతుబట్టకుండా మారింది. ఆ దిశగానే ఓ కంప్యూటర్ నమూనాలో గ్రహశకల విస్ఫోటన ప్రక్రియను పూర్తిచేశారు. ఈ గ్రహ శకలానికి సంబంధించిన ఏ భాగం కూడా భూమి మీద పడకుండా ఎలా జాగ్రత్త వహించాలో ఈ ప్రయోగంలో నిర్ధారించుకున్నారు. ఎస్‌కెఐఎఫ్ అనే సూపర్ కంప్యూటర్ సహాయంతో ఈ కంప్యూటర్ నమూనాను ప్రయోగాత్మకంగా రూపొందించి గ్రహశకల విస్పోటనాన్ని కూడా పూర్తిచేయగలిగారు. వాస్తవికంగా గ్రహ శకలాలను అణు విస్పోటనాల ద్వారా పేల్చేసేందుకు అవకాశం ఎంతమేరకు ఉందనే విషయాన్ని ఈ ప్రయోగం ద్వారా రుజువు చేసుకున్నామని రష్యాలోని టోమ్స్క్ యూనివర్సిటీకి చెందిన టటియానా గలూషినా అనే ఖగోళవేత్త వెల్లడించారు. ఏ గ్రహ శకలమూ భూమికి సమీపించకుండా దాన్ని మార్గం మధ్యలోనే ధ్వంసం చేయాలని భావిస్తున్నప్పటికీ దానివల్ల భూమికి అనేక రకాల ఇతర విపరిణామాలు సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ విస్పోటక పదార్థాలు అత్యంత తీవ్రమైన అణు థార్మిక శక్తిని కలిగివుంటాయి కాబట్టి అవి చిన్నముక్కలుగా భూమిమీద పడ్డా ప్రమాదమేనని అన్నారు.