అంతర్జాతీయం

యోగాకు యూఎస్‌లో యమ క్రేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 10: అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం అగ్రరాజ్యం అమెరికా సన్నద్ధమవుతోంది. ఈనెల 16న నిర్వహించే యోగాలో పాల్గొనేందుకు అమెరికన్లు ఉత్సాహం చూపుతున్నారు. ఆదివారం 2,500 మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ 2014 డిసెంబర్ 11న యోగా ప్రతిపాదన చేయగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస ప్రకటించింది. వాషింగ్టన్‌లో 16న నిర్వహించే యోగాకు పౌరులను నుంచి విశేషమైన స్పందన వస్తోందని, ఈ అంతర్జాతీయ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం వరుసగా ఇది ఐదోసారని, ఈ ఏడాది ఇప్పటికే రెండువేల ఐదొందల మంది ఔత్సాహకులు తన పేర్లను నమోదు చేయించుకున్నారని అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ శ్రుంగల వెల్లడించారు. ఇండియన్ ఎంబసీ, మరో ఇరవై సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సారధ్యం వహిస్తున్నాయని ఆయన అన్నారు. ఈసారి యోగా కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా విజిటేరియన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా కార్యక్రమానికి అమెరికాలోని అన్ని దేశాల రాయబారులు, ఐరాస సంస్థల ప్రతినిధులను ఆహ్వానించినట్టు హర్షవర్ధన్ తెలిపారు. అలాగే అమెరికా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారన ఆయన వెల్లడించారు. అమెరికాలో మూడు కోట్ల 60 లక్షల మంది యోగా నేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. ఇది నిజంగా మంచి వార్తగా ఆయన తెలిపారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, శారీక, మానసిక, ఆధ్యాత్మిక చింతన చేకూరుతుందని ఆయన చెప్పారు.