అంతర్జాతీయం

ఉగ్రవాదులకు భుజకీర్తులా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 4: సార్క్ దేశాల సదస్సు సాక్షిగా పాకిస్తాన్ ఉగ్ర స్వరూపాన్ని భారత్ తీవ్ర పదజాలంతో ఎండగట్టింది. ఉగ్రవాదుల్ని కీర్తించడం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం తక్షణం కట్టి పెట్టాలని పరోక్షంగానైనా చాలా స్పష్టంగానే పాకిస్తాన్‌కు తేల్చిచెప్పింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్న 26/11, పఠాన్‌కోట్ దాడుల్ని ప్రస్తావించింది. సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో మాట్లాడిన భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో అడుగడుగునా పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాన్ని ప్రోత్ససిస్తున్న రాజ్య, రాజ్యేతర శక్తుల్ని వదిలి పెట్టడానికి వీల్లేదన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న, ప్రోత్సహిస్తున్న, అన్ని విధాలుగా మద్దతునందిస్తున్న దేశాలను ఏకాకుల్ని చేయాలన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపైనే కాకుండా వాటికి మద్దతిస్తున్న వ్యక్తులు, దేశాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సార్క్ దేశాల వేదికపై రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఇలాంటి కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ముంబయి, పఠాన్‌కోట్ దాడి బాధితులకు న్యాయం చేసినట్టవుతుందని అన్నారు. పఠాన్‌కోట్‌తో పాటు ఇటీవల ఢాకా, కాబూల్‌లలో జరిగిన దాడుల్ని కూడా రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ఉగ్రవాదం వల్ల దక్షిణాసియా ప్రాంతంలోనే శాంతి భద్రతలకు తీవ్రస్థాయిలో ముప్పువాటిల్లుతోందన్నారు. ఇటీవల కాశ్మీర్‌లో భారత దళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాది బూర్హన్ వనిని ప్రాణత్యాగం చేసిన వ్యక్తిగా పాక్ పేర్కొనడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన రాజ్‌నాథ్ ‘ఉగ్రవాదాన్ని కీర్తించడం, దేశాలు దాన్ని బలపరచడం ఎంత మాత్రం క్షేమదాయకం కాదు’అని అన్నారు. ఇలాంటి ధోరణి ఏ దేశానికీ మంచిది కాదన్నారు. ఒక దేశానికి చెందిన ఉగ్రవాది మరో దేశానికి స్వాతంత్య్ర సమరయోధుడో కాలేడన్నారు. ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా అణచివేసినప్పుడే దక్షిణాసియా ప్రాంత దేశాల అభివృద్ధికి, సుసంపనం కావడానికీ ఆస్కారం ఉంటుందన్నారు. రాజ్‌నాథ్ ప్రసంగం ఆద్యంతం హిందీలోనే సాగింది. ఉగ్రవాద చర్యల్ని ఖండించినంత మాత్రాన సరిపోదని, ఈ జాఢ్యాన్ని పారదోలేందుకు ప్రతిదేశం కంకణం కట్టుకోవాలని, చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాలని అన్నారు.

చిత్రం.. గురువారం ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు