అంతర్జాతీయం

మోదీ విమానానికి పాక్ అనుమతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూన్ 11: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం తన గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ వారం జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోదీ బిష్కేక్‌కు వెళ్లనున్నారు. కిర్గిజ్‌స్తాన్‌లోని బిష్కేక్ వెళ్లాలంటే పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లవలసి ఉంటుంది. ఈ నెల 13, 14 తేదీలలో ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. అందువల్ల ప్రధాని మోదీ విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని ఆ దేశానికి భారత్ విజ్ఞప్తి చేసింది. భారత్ విజ్ఞప్తికి తమ దేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని పాకిస్తాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. పాకిస్తాన్ శాంతి చర్చల కోసం చేసిన ప్రతిపాదనపై భారత్ స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్నారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో గల జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరంపై భారత వాయుసేన (ఐఏఎఫ్) ఫిబ్రవరి 26వ తేదీన దాడి చేసిన తరువాత పాకిస్తాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. పాకిస్తాన్ మీదుగా మొత్తం 11 గగనతల మార్గాలుండగా, ఆ తరువాత పాక్ కేవలం రెండు మార్గాలను తెరిచింది. ఈ రెండు మార్గాలు కూడా దక్షిణ పాకిస్తాన్ మీదుగా వెళ్తాయి. ప్రధానమంత్రి మోదీ బిష్కేక్‌కు వెళ్లడానికి గాను ఆయన ప్రయాణించే విమానాన్ని పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని భారత్ చేసిన విజ్ఞప్తికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఆ అధికారి ఒక వార్తాసంస్థకు చెప్పారు.