అంతర్జాతీయం

షాబాజ్‌కు 14 రోజుల ఎన్‌ఏడీ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూన్ 12: పాకిస్తాన్‌లోని పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు హజ్మా షాబాజ్‌ను 14 రోజుల నేషనల్ ఎకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏడీ) కస్టడీకి అప్పగించారు. మనీ లాండరింగ్‌తోపాటు వివిధ ఆర్థిక కుంభకోణాలు, అవినీతికి పాల్పడినట్టు షాబాజ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు, జాతీయ అసెంబ్లీ విపక్ష నేత షాబా జ్ షరీఫ్ కుమారుడైన 44 ఏళ్ల హజ్మా షాబాజ్‌పై ఉన్న ఆరోపణల నేపథ్యంలో లాహో ర్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని ఇస్లామాబాద్‌లో అరెస్టు చేసిన ఎన్‌ఏడీ ఇపుడు షాబాజ్‌ను కూడా విచారించనుంది. వెయ్యి కోట్ల ఆర్థిక కుంభకోణాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.