క్రైమ్/లీగల్

రేప్ కేసులో మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్: మైనర్ బాలికపై అత్యాచారం, హతమార్చిన కేసులో ఓ వ్యక్తికి అల్వార్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్ కుమార్ అలియాస్ ధర్మేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. పోస్కో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ శర్మ కేసును విచారించిన తర్వాత బుధవారం తీర్పును వెల్లడించారు. భారత శిక్షాస్మృతి 302 (హత్య), 363 (కిడ్నాప్), 376 (అత్యాచారం) సెక్షన్ల కింద రాజ్‌కుమార్‌కు మరణశిక్షను విధిస్తున్నట్టు ప్రకటించారు. 2015లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.