అంతర్జాతీయం

ఉగాండాలో అబోలా కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంపాలా, జూన్ 12: ఉగాండాలో అబోలా కారణంగా ఓ బాలుడు మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఐదేళ్ల బాలుడికి అబోలా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడని వివరించింది. ఉగాండాకు సరిహద్దులో ఉన్న కాంగోలో అబోలా వైరస్ కేసులు వేలాదిగా నమోదవుతున్నాయి. ఆ ప్రభావం తమ దేశంపైన కూడా పడిందని ఉగాండా అధికారులు అంటున్నారు. అబోలాతో మృతి చెందిన బాలుడి తల్లి కాంగో దేశానికి చెందిందని, ఈ వ్యాధి బాలుడికి సోకడానికి ఇది కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఇలావుంటే, కనీసం రెండువేల అబోలా కేసులు నమోదైనట్టు కాంగో ఒక ప్రకటనలో తెలిపింది.