అంతర్జాతీయం

రాజకీయ ‘దొంగ’లపై ఇమ్రాన్ ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 12: పాకిస్తాన్‌లో రాజకీయ ‘దొంగల’ భరతం పట్టేందుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కంకణం కట్టుకొన్నారు. దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన అవినీతిపరులను వదిలిపెట్టబోనని ఇమ్రాన్ చెబుతున్నారు. ‘గత పదేళ్లలో దేశాన్ని ఆర్థికంగా కుంగదీసిన అవినీతి పరులను విడిచి పెట్టను.. పలువురు కీలక నేతలకు ఆర్థికపరమైన అవినీతితో సంబంధాలున్నాయి.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను’ అని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. తొలిసారిగా మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల క్రితం ఆరు లక్షల కోట్ల రుణాలుండగా ప్రస్తుతం అది 30 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. అవినీతిపరుల భరతం పట్టేందుకు హైలెవెల్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని ఈ విధంగా ఆర్థికంగా కుంగదీసే విధంగా వ్యవహరించిన నేతలను ‘దొంగలు’గా ఆయన అభివర్ణించారు. మనీ లాండరింగ్ తదితర కేసుల్లో అక్కడి పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత హంజా షెహ్‌బాజ్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) సోమవారం అరెస్టు చేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఇమ్రాన్‌ఖాన్ దేశంలోని అవినీతిపరుల గురించి మాట్లాడారు. అదేరోజు మల్టీమిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడిన కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు అఫ్ అలీ జర్దారీని సైతం అరెస్టు చేశారు. మరో అవినీతి కేసులో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైతం 2018 నుంచి జైల్‌లో ఉన్నారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా తాను పనిచేస్తానని, ఇందులో భాగంగా ముందు రాజకీయ నేతల అవినీతి ఉపేక్షించబోనని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి నిలకడగానే ఉందనీ.. ఆర్థిక పరమైన వత్తిడులు తగ్గాయని ఆయన అన్నారు. మరింత మంది రాజకీయ అవినీతిపరుల భరతం పడతానని ఇమ్రాన్ హెచ్చరించారు. పదేళ్లలో 24 లక్షల కోట్ల రూపాయిల అవినీతికి పాల్పడ్డారంటే ఈ దొంగల పరిస్థితి ఏ విధంగా ఉందో చెబుతోందని అన్నారు. అత్యున్నత స్థాయి కమిషన్‌లో (హైలెవెల్ కమిషన్) ఐబీ, ఐఎస్‌ఐ, ఎఫ్‌బీఆర్, ఎస్‌ఈసీపీ వంటి సంస్థలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 2008 నుంచి వరుసగా రెండుసార్లు నవాజ్ షరీఫ్ పనిచేసిన కాలంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఇమ్రాన్ చెప్పారు. ఇటీవల జరిగిన ప్రముఖుల అరెస్టులపై ఆయన మాట్లాడుతూ ‘నేను అల్లాకు రుణపడి ఉన్నాను.. ఎందుకంటే అవినీతిపరులైన ప్రముఖ నేతలు ఇప్పుడు జైల్లో ఉన్నారు.. దీనిని ఎవరూ ఊహించలేరు’ అని స్పష్టం చేశారు.