అంతర్జాతీయం

పోక చెట్టు మళ్లీ పంపిస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారిస్, జూన్ 12: తాను బహుమానంగా ఇచ్చిన చెట్టు ఎండిపోయినంత మాత్రాన అమెరికా-ఫ్రెంచ్‌ల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని భావించరాదని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ అన్నారు. గత ఏడాది ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ అమెరికా సందర్శించినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్‌కు ‘ఓక్’ మొక్కను బహుకరించారు. అది ట్రంప్ అధికార గృహం వైట్ హౌస్ ఆవరణలో ఎండిపోయింది. ఇలాఉండగా స్విస్ టీవీ ఆర్‌టీఎస్‌లో మాక్రాన్ ఇంటర్వ్యూ ప్రసారమైంది.
ఈ సందర్భంగా మాక్రాన్ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ మొక్క ఎండిపోయినంత మాత్రాన అమెరికా-ఫ్రెంచ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని భావించడం భావ్యం కాదన్నారు. ఇరు దేశాల సంబంధాలకు ప్రతీకగా మొక్కను ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మొక్క ఎండిపోయినందున మళ్లీ పంపిస్తానని ఆయన చెప్పారు.