అంతర్జాతీయం

చైనా దెబ్బతింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 12: చైనా ఆర్థికంగా దెబ్బతిన్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్యపరమైన అంశాల్లో సత్సంబంధాలను కోరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా నుంచి దిగుమతి అవుతున్న పలు వస్తు సేవలపై అమెరికా పన్నును భారీగా పెంచింది. దీనికి ప్రతిచర్యగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల టారిఫ్‌ను కొన్నిరెట్లు పెంచేసింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమై ప్రస్తుతం తీవ్రస్థాయికి చేరుకుంది. అమెరికా పెంచిన టారిఫ్ చైనాను ఇబ్బంది పెట్టిందని, దీంతో ఆ దేశం తమతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను కోరుకుంటోందని ట్రంప్ అన్నారు. చైనా ఆధిపత్యాన్ని సమర్థంగా గండికొట్టగలిగామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలకు ఎగుమతులను పెంచాలని చైనా ప్రయత్నిస్తోందని, కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని ఆయన అన్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా చైనాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ట్రంప్ అన్నారు. దీనికి చైనా మొండివైఖరే కారణమని ఆయన ఆరోపించారు. ఇలావుంటే, జపాన్‌లోని ఒకాసాలో జరిగే జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఇటు ట్రంప్, అటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరుకానున్నారు. వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై వాణిజ్యపరమైన అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి ఇదివరకే పలు అంశాలపై వివిధ ప్రతిపాదనలు చేసినప్పటికీ చైనా వాటిని తిరస్కరించిందని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. చైనా మొండివైఖరి అనుసరించడంతో తాము కూడా అదే పంథాను ఎంచుకోక తప్పలేదని వ్యాఖ్యానిస్తున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా బిలియన్ డాలర్లను సరికొత్త టారిఫ్ రూపంలో సంపాదించినట్టు అమెరికా అధికారులు పేర్కొంటున్నారు. మొత్తమీద 14 ట్రిలియన్ డాలర్లు అమెరికా లబ్ధి పొందితే, చైనా అదే స్థాయిలో దెబ్బతింది. ఈ అంశాలనే ట్రంప్ ప్రస్తావిస్తూ అమెరికా ప్రయోజనాలను భంగపరిచే విధంగా ఎవరు ప్రయత్నించినా ఇదే రీతిలో స్పందిస్తామని తేల్చిచెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు, రాబోయే అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జొ బిడెన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తిప్పికొట్టారు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తు సేవలపై భారీగా పన్నులను విధించడాన్ని తప్పుపడుతున్న బిడెన్‌ను ఆయన చైనా మద్దతుదారుడిగా అభివర్ణించారు.