అంతర్జాతీయం

దూసుకెళుతున్న హిల్లరీ క్లింటన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కీలక రాష్ట్రాల్లో దూసుకెళుతున్నారు. తాజాగా జరిగిన సర్వేలో హిల్లరీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించినప్పటికీ అదెంతో కాలం నిలవదంటూ ట్రంప్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. హిల్లరీ సాధించిన ఆధిక్యతను ట్రంప్ రెండు మూడు వారాల్లోనే సమం చేసేస్తారన్న నమ్మకంతో ఆయన విధేయులు ఉన్నారు. తాజా సర్వే వివరాలను బట్టి పెన్సిల్వేనియాలో 11శాతం, న్యూ హాంప్‌షయర్‌లో 17శాతం, మిచిగన్‌లో ఏడు శాతం ఆధిక్యత హిల్లరీకి లభించింది. డెమొక్రటిక్ పార్టీ జాతీయ సదస్సు ఇటీవలే జరిగింది కాబట్టి పలు రాష్ట్రాల్లో హిల్లరీకి ఆధిక్యత రావడం పెద్ద విషయమేమీ కాదని ట్రంప్ ప్రచార సారధి పౌల్ మనాఫోర్ట్ వ్యాఖ్యానించారు. పైగా, ఈ చిన్న చిన్న విజయాలపై తాము ఆశలు పెట్టుకోలేదని, తమ అంతిమ లక్ష్యం నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో గెలవడమేనని ఆయన తెలిపారు.