అంతర్జాతీయం

ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్కెక్, జూన్ 15: అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి ‘సమానత్వం అధారం’గా, ‘గౌరవమైన పద్ధతి’లో భారత్‌తో చర్చలు జరపడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ స్పష్టం చేశారు. సానుకూల వాతావరణంలో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు ముందుకు రావడం అనే అంశం ఇపుడు భారత్ తేల్చుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కిర్గిజ్ రాజధానిలో జరుగుతున్న 19వ షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. శుక్రవారంనాటి ఎస్‌సీఓ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో తమ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇరు దేశాల మధ్య నెలకొన్న పలు అపరిష్కృత సమస్యలపై చర్చించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఇరు దేశాల ప్రధానుల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి’ అని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఇక్కడ శనివారంనాడు ఒక పత్రికా ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. భారత ప్రభుత్వం ‘ఎన్నికల ఆలోచనా విధానం’తోనే తమ ‘ఓటుబ్యాంకు చెక్కుచెదరకుండా’ ఉండేలా వ్యవహరించిందని, ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఏమి చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో తాము త్వరితగతిన స్పందించలేకపోవడం లేదా ఇబ్బంది పడడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఒక అంశంపై చర్చించే ముందు భారత్ సన్నద్ధతగా ఉన్నపుడు తాము కూడా అదే రీతిలో సన్నద్ధంగా ఉండేందుకు తద్వారా చర్చల్లో చురుకుగా పాలుపంచుకునేందుకు ఆస్కారం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా, అపరిష్కృత సమస్యలపై సానుకూల వాతావరణంలో భారత్‌తో తాము ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, గౌరవప్రదమైన రీతిలో చర్చించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. వివిధ అంశాలపై పరస్పరం చర్చలు జరిపేందుకు వాస్తవిక దృక్పథంతో, మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగేందుకు పాక్ ఎప్పుడూ సిద్ధమేనని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ మరోసారి స్పష్టం చేశారు. ఇదిలావుండగా, భారత్‌తో పలు అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చించేందుకు పాకిస్తాన్ ఆహ్వానంచడం లేదన్న పలువురి విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేకానేక సమస్యలపై దైపాక్షిక చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చేందుకు భారత్ తొలుత తన నిర్ణయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సమానత్వం, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ భారత్‌తో ఎప్పుడైనా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘భారత ప్రభుత్వం ఇంకా ఎన్నికల ఆలోచనా విధానంలోనే ఉండి అందులోంచి బయటపడడం లేదు’ అని ఖురేషీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పలు అపరిష్కృత సమస్యలపై ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు వీలుగా రెండు వారాల కిందటే పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ప్రత్యేక లేఖలు రాసిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్, నరేంద్ర మోదీ మధ్య శుక్రవారంనాడు చర్చలు జరిగాయి. ఇదిలావుండగా, పాకిస్తాన్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళాలు ఇటీవల దాడులు జరిపిన తర్వాత నుంచి పాక్‌తో చర్చలు జరిపేందుకు భారత్ సుముఖంగా లేదు. అయితే, ఇరుదేశాల ప్రజల సమస్యల పరిష్కారానికి చక్కని పరిష్కారాలను కనుగొనేందుకు వీలుగా గత నెల 26న భారత ప్రధాని మోదీతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ టెలిఫోన్ ద్వారా జరిపిన సంభాషణలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, మోదీ మాత్రం టెర్రిరిజం, హింస నుంచి బయటకు వచ్చేందుకు, తద్వారా ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రయత్నిస్తేనే తాము ద్వైపాక్షిక చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో 40 సీఆర్‌పీఎఫ్ జవాన్లను పాకిస్తాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మట్టుబెట్టిన తర్వాత, పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపిన తర్వాత ఇరు దేశాల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది.