అంతర్జాతీయం

మీడియా గొంతు నొక్కుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 17: విద్వేష ప్రసంగాలపై ఐక్యరాజ్య సమితి (చట్టం) ఆదేశాలను ఆసరగా చేసుకుని శ్రీలంక ప్రభుత్వం మీడియాను, ముస్లిం మైనారిటీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని శ్రీ లంకలోని పాత్రికేయులు మండిపడ్డారు. ముస్లింలకు, బుద్దిస్టులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా రాసిన వార్తల కారణంగా అల్లర్లు జరిగాయంటూ ఓ గౌరవప్రదమైన జర్నలిస్టును స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారని ఫ్రీ మీడియా మూవ్‌మెంట్ రైట్స్ గ్రూపు ఆరోపించింది. ఇలాఉండగా శుక్రవారం మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే తాము ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ (ఐసీసీపీఆర్) చట్టం ప్రకారం ఫ్రీలాన్స్ రచయిత కౌసల్ పీరెరా కథనాలను పరిశీలించామని తెలిపింది. కాగా ఫ్రీ మీడియా మూవ్‌మెంట్ రైట్స్ గ్రూపు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు గత నెలలో ముస్లిం మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసులు తీవ్ర విమర్శలను ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ మహిళ ధరంచిన టీ-షర్ట్‌పై నౌక స్టీరింగ్ బొమ్మ ఉంది. అయితే పోలీసులు ఆ స్టీరింగ్‌ను బుద్దుల ధర్మ చక్రాన్ని ధరించి అవమానించారని భ్రమింరు. ఆ మహిళను రిమాండ్ కస్టడీలో ఉంచడం జరిగింది. మూడు వారాల క్రితం ఓ పోలీసు అధికారి జోక్యం చేసుకుని ఆమెను విడిపించారు. అవార్డు పొందిన రచయిత, కవి శక్తికా సత్కుమారను కూడా ఐసీసీపీఆర్ చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. వీటన్నింటిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.