అంతర్జాతీయం

ఆరోగ్య సోపానం యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 17: గత ఐదేళ్ల కాలంలో భారతీయ యోగాకు అమెరికాలో గణనీయమైన ఆదరణ పెరిగిందని భారత రాయబారి వర్ధన్ శ్రీంగ్లా అన్నారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని 2014లో ఐక్యరాజ్య సమితి ప్రకటించినప్పటి నుంచి ఈ ఆరోగ్య విధానానికి ఆదరణ పెరుగుతూనే వచ్చిందని ఆయన తెలిపారు. ఇక్కడి జాతీయ సంస్మరణ కేంద్రంలో వందలాది మందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఒక అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు యోగా ప్రాధాన్యతను గుర్తించారని, అందుకే దీనికి ఆదరణ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుందన్నారు. భాషా, సాంస్కృతిక నేపథ్యాలతో నిమిత్తం లేకుండా యోగాను సమగ్ర ఆరోగ్య సాధనంగా ప్రపంచ ప్రజలు గుర్తించిన కారణంగానే దీని ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఒక్క అమెరికాలోనే లక్షలాది మంది యోగా పట్ల ఆకర్షితులై దీనిని అనుసరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ యోగా ప్రాచుర్యాన్ని పెంచేందుకు భారతీయ దౌత్య కేంద్రాలు చేస్తున్న కృషిని శ్లాంఘించిన ప్రధాని మోదీ ప్రతి ఒక్కరూ యోగా అభ్యసించేలా చేయాలని ట్వీట్ చేశారు. కాగా, ఈ ఏడాది జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు అన్ని దేశాల్లోనూ భారతీయ దౌత్య కేంద్రాలు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. అమెరికాలో ఏకంగా ఒక యోగా జర్నలే తెరపైకి వచ్చింది. తాజా లెక్కలను బట్టి 36 మిలియన్లకు పైగా ప్రజలు యోగా పట్ల ఆకర్షితులైనట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే అతి తక్కువ వ్యవధిలోనే భారతీయ యోగా అమెరికన్లను ఎంతగా ఆకర్షించిందో స్పష్టమవుతోందని భారత రాయబారి శ్రీంగ్లా అన్నారు.