అంతర్జాతీయం

కాశ్మీరులో గాయపడిన వారికి వైద్య సహాయాన్ని అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 6: భారత్‌లో దాడులకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ మరోసారి బాహాటంగా తన నైజాన్ని చాటుకుంది. కాశ్మీరు అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చేందుకు పదేపదే విఫలయత్నాలు చేస్తున్న పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, కాశ్మీరు హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారికి వైద్య సహాయాన్ని అందజేస్తామని శనివారం ప్రకటించారు. కాశ్మీరు సమస్యను ‘మానవతా సంక్షోభం’గా ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా కాశ్మీరులో గాయపడిన వారికి వైద్య సేవలు అందించేలా భారత్‌పై వత్తిడి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజానికి నవాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదులను అమర వీరులుగా కీర్తించడం మానుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇస్లామాబాద్‌లో సార్క్ సమావేశం సందర్భంగా పాకిస్తాన్‌కు హితవు పలికి రెండు రోజులు తిరక్కుండానే నవాజ్ షరీఫ్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.