అంతర్జాతీయం

డైనోసార్ ఎముకల్లో అతిసూక్ష్మక్రిములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 19: శిలారూపం పొందిన డైనోసార్ ఎముకల్లో జీవిస్తున్న ఆధునిక అతిసూక్ష్మక్రిములను శాస్తజ్ఞ్రులు తాజాగా కనుగొన్నారు. భద్రపరచిన మాంసకృత్తుల నుంచి డైనోసర్ల సమరూప జీవులను సృష్టించవచ్చనే నమ్మకాన్ని శాస్తజ్ఞ్రులు కనుగొన్న ఈ తాజా అంశం తోసిపుచ్చింది. నకొంతమంది లుప్తజంతు శాస్తజ్ఞ్రులు డైనోసర్ ఎముకల్లో అసాధారణ రీతిలో చర్మం, ఎముకల్లో ఉండే మాంసకృత్తులతో పాటు రక్తం, ఎముక కణా ల వంటి మెత్తని కణజాలం ఉందని కనుగొన్నట్టుగా సమాచారం.
భద్రంగా ఉన్న ఈ మాంసకృత్తులను ఉపయోగించి అంతరించి పోయిన డైనోసర్లను పునరుజ్జీవింప చేయవచ్చనే ఊహాకల్పనలు వెలువడ్డాయి. అయితే, తాజాగా అమెరికాలోని ఫీల్డ్ మ్యూజియంకు చెందిన శాస్తజ్ఞ్రులు శిలాజరూపం పొందిన డైనోసర్ ఎముకల్లో.. చర్మం, ఎముకల్లో ఉండే మాంసకృత్తుల కోసం వెతికారు. వారికి మాంసకృత్తులకు బదులుగా డైనోసర్ ఎముకల లోపల పెద్ద మొత్తంలో ఆధునిక బ్యాక్టీరియా జీవిస్తుండటం కనిపించింది. ‘పూడ్చివేయబడిన డైనోసర్ ఎముకలు శిలాజరూపం పొందిన తరువాత వాటిలో జీవిస్తున్న అతి సూక్ష్మక్రిములను కనుగొనటం ఇదే మొదటిసారి’ అని ఫీల్డ్ మ్యూజియంలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకుడు ఎవాన్ సైట్టా తెలిపారు. ‘చెక్కుచెదరకుండా భద్రపరచి ఉన్న డైనోసర్ మాంసకృత్తులను పొందవచ్చనే ఆలోచనను మరోసారి తాజా పరిశోధన తోసిపుచ్చిందని నేను చెబుతున్నాను’ అని సైట్టా పేర్కొన్నారు. ‘శిలాజాలలో కొన్ని అణువులు జీవించగలవు. కాని, మాంసకృత్తులు జీవించలేవని నేను అనుకుంటున్నాను’ అని సైట్టా వివరించారు.