అంతర్జాతీయం

శ్రీలంక తొలి ఉపగ్రహం ‘రావణ-1’ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 19: శ్రీలంక మొట్టమొదటి ఉపగ్రహం ‘రావణ-1’ విజయవంతమైంది. ఇద్ద రు స్థానిక ఇంజనీర్లు రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి బుధవారం ప్రయోగించారు. దీంతోపాటు జపాన్, నేపాల్‌కు చెందిన మూడు, బీఐఆర్‌డీఎస్‌కు చెందిన మరో రెండు ఉపగ్రహాల ను కూడా ఇక్కడ నుంచి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కాగా, సుమారు 1.05కిలోల బరువున్న ఈ ‘రావణ-1’ను స్థానిక కాలమానం ప్రకా రం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు కక్ష్యలోకి ప్రవేశపెట్టారని కొలంబో పేజ్ అనే వార్తాపత్రిక పేర్కొంది. ఈ ఉపగ్రహాన్ని తరీందు దయరత్నే, దులానీ చమికా అనే ఇంజనీర్లు రూపొందించారు. ఈ ఇద్దరూ జపాన్‌లోని కుషూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్పేస్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీరు రూపొందించిన ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించిన సందర్భంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.