అంతర్జాతీయం

ప్రిన్స్ విలియమ్ కాన్వాయ్ ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 19: బ్రిటన్ యువరాజు విలియమ్, ఆయన భార్య కాటే కాన్వాయ్‌లోని ఒక వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..విలియమ్, కాటే సెంట్రల్ లండన్ నుంచి విండ్సర్‌లోని తమ స్వగృహానికి వెళ్తున్న సమయంలో వారి కాన్వాయ్‌కి చెందిన ఓ మోటార్ సైకిల్ ఢీకొనడంతో 83 ఏళ్ల పెన్షనర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని విలియమ్ ట్వీట్ చేశారు. ఈ సంఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.