అంతర్జాతీయం

యూఎస్ డ్రోన్‌ను కూల్చేశాం ఇరాన్ ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, జూన్ 20: అమెరికాకు చెందిన ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. హొర్ముజ్ కనుమల వద్ద తమ భూ భాగంలోకి వచ్చిన అమెరికా గూఢచార ద్రోన్‌ను కూల్చివేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీ) ప్రకటించింది. తీర ప్రాంతంలో యుద్ధ వాతావరణానికి అమెరికా కారణమవుతున్నదని ఆరోపించింది. అమెరికా పదేపదే తమ భూ భాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించింది. గూఢచార డ్రోన్‌లను పంపి తమ సైనిక స్థావరాల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తింది. ఇస్లామిక్ గణతంత్ర రాజ్యమైన ఇరాన్‌పై అమెరికా కక్ష కట్టిందని ఐఆర్‌జీ ఆరోపించింది. గూఢచార డ్రోన్‌ను కూల్చివేయడం ద్వారా, తమ భూ భాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశామని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి యుద్ధ వాతావరణం నెలకొందని తెలిపింది. 2015లో కుదిరిన అణు ఒప్పందాన్ని అమెరికా గత ఏడాది రద్దుచేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమపై దాడులకు దిగితే మాత్రం తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. కాగా, డ్రోన్‌ను కూల్చివేసిన విషయాన్ని అమెరికా ధ్రువీకరించింది.