అంతర్జాతీయం

తాలిబన్ చీఫ్‌తో చర్చలు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 20: అఫ్గానిస్తాన్‌కు చెందిన తాలిబన్ చీఫ్ ముల్లా అబ్దుల్ గని బరాదర్‌తో చర్చలు జరిపిన మాట వాస్తవేమనని చైనా అంగీకరించింది. శాంతి కోసం అబ్దుల్ గని చేస్తున్న ప్రయత్నాలకు సహకరించడమే తమ ఉద్దేశ్యమని చైనా స్పష్టం చేసింది. 1994లో అఫ్గాన్‌లో తాలిబన్ పాలనకు శ్రీకరాం చుట్టిన నలుగురు కీలక వ్యక్తుల్లో అబ్దుల్ గని ఒకడు. ఆ తర్వాత కాలంలో పాకిస్తాన్ అతనిని అరెస్ట్ చేసింది. గత ఏడాది జైలు నుంచి విడుదలైన తర్వాత అబ్దుల్ గని శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నారని చైనా ప్రకటించింది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణనాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతుందని చైనా తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన తమకు కూడా అత్యవసరమేనని పేర్కొంది. అందుకే అబ్దుల్‌గనితో ఇటీవలే చర్చలు జరిపామని, త్వరలోనే శాంతి స్థాపన చర్చలు మొదలవుతాయన్న నమ్మకం తమకుందని చైనా ప్రకటించింది.