అంతర్జాతీయం

యుద్ధమొస్తే.. తీవ్ర పర్యవసానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, జూన్ 23: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరాన్ ఆదివారం అగ్రరాజ్యాన్ని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఇరాన్‌తో ఎలాంటి యుద్ధానికి దిగినా ఈ ప్రాంతమంతటా నియంత్రించలేని పర్యవసానాలకు దారితీస్తుందని, అమెరికా బలగాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆ దేశం అమెరికాను హెచ్చరించింది. అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిన తరువాత ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్ రాడార్లు, క్షిపణి వ్యవస్థను మేజర్ జనరల్ ఘొలామలీ రషీద్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్‌కు చెందిన శక్తివంతమయిన రెవల్యూషనరి గార్డ్స్ కాప్స్ (ఆర్‌జీసీ)ను ఉద్దేశించి మాట్లాడుతూ అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ సాయుధ బలగాలలో సంయుక్త సైనిక ఆపరేషన్లను మేజర్ జనరల్ పర్యవేక్షిస్తుంటారు. ‘అమెరికా పాలనాయంత్రాంగం అమెరికా బలగాల ప్రాణాలను రక్షించుకోవడానికి బాధ్యతాయుతమయిన రీతిలో ప్రవర్తించాలి’ అని ఈ సందర్భంగా మేజర్ జనరల్ రషీద్ వ్యాఖ్యానించినట్టు పాక్షిక అధికార వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది. ఒకవేళ యుద్ధం తలెత్తితే, దాని పరిధి, అది ఎంతకాలం కొనసాగుతుందనేది నియంత్రణలో ఉండదు. ఉద్రిక్తతలు ఏమాత్రం పెరిగినా, దానికి ‘అమెరికా జోక్యం చేసుకునే విధానమే’ కారణం అని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనాయంత్రాంగం ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను తీవ్రం చేసి గరిష్ఠ స్థాయిలో ఒత్తిడి పెంచడంతో పాటు ఈ రీజియన్‌లో అమెరికా బలగాల సంఖ్యను పెంచడం వల్ల పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరాన్ మేజర్ జనరల్ రషీద్ అమెరికాను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు.