అంతర్జాతీయం

ఆంక్షలు మాపై ప్రభావం చూపవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, జూన్ 24: తమ దేశంపై అగ్రరాజ్యం విధించాలనుకున్న సరికొత్త ఆర్థిక ఆంక్షలు ప్రభా వం చూపవని ఇస్లామిక్ రిపబ్లిక్‌కు చెందిన విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్ వౌసవి సోమవారంనాడు స్పష్టం చేశారు. ‘ఆ కొత్త ఆంక్ష లు ఎందుకు విధిస్తున్నారో వాస్తవంగా మాకు తెలియదు. ఏ లక్ష్యాన్ని వారు ఆశిస్తున్నారు. ఆంక్షల ప్రభావం మాపై పడితే వారిని క్షమించం’ అని ఆయన అమెరికాకు తీవ్రంగా హెచ్చరించారు. సోమవారంనాడు ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నిజంగా మాపై ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? ఇటీవల కాలంలోగానీ లేదా గడిచిన 40 ఏళ్ల కాలంలో ఎన్నడూ అమెరికా మా దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ గురువారంనాడు అమెరికా డ్రోన్‌ను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గల్ఫ్‌లో సమస్యాత్మకమైన ప్రాం తాల్లో అమెరికా డ్రోన్ ద్వారా తాజాగా దాడులు జరిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సై తం ఇరాన్‌పై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి పిలుపునిచ్చారు. అం తేకాకుండా ఇరాన్‌పై సరికొత్త ఆర్థిక ఆంక్షలు విధించాలని ట్రంప్ సోమవారంనాడు ప్రకటించారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు వీలు గా ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా తాము ముందుకు దూసుకువెళ్తాలని ట్రంప్ స్పష్టం చేశా రు. అయితే, అమెరికా తాజా నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, బెదిరింపులు, ఆర్థిక ఆంక్షలు వి ధించడం సమంజసం కాదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని సలహాదారు హసమొదీన్ అస్నా సోమవారంనాడు ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. ‘యుద్ధం..ఆంక్షలు రెండూ నాణేనికి రెండు పా ర్శ్వాలు’గా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.
వెన్ను విరిగినట్టే: ఇరాన్ పౌరులు
అమెరికా విధించిన ఆంక్షలతో తమ వెన్ను విరిచినట్టేనని ఇరాన్ పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల తమ దేశంలోని 80 మిలియన్ మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. 2015లో టెహ్రాన్ అణు ఒప్పందాల విధానంపై మండిపడిన అమెరికా అధ్యక్షుడు అప్పట్లో తీసుకున్న పలు ఆంక్షలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా యూరోపియన్ దేశాల ఆర్థిక ఆంక్షలను ఇరాన్ తిప్పికొడుతోంది. అయితే, తాజాగా అమెరికా డ్రోన్‌ను కూల్చిన తర్వాత ఎదురుకాబోయే సవాళ్లను సైతం దీటుగా ఎదుర్కొంటామని ఇరాన్ స్పష్టం చేసింది. తమ డ్రోన్‌ను కూల్చివేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరాన్‌పై సరికొత్త ఆర్థిక ఆంక్షలు విధించేందుకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించడంతో దాని ప్రభావం భవిష్యత్తులో దేనికి దారితీస్తుందోనని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.