అంతర్జాతీయం

అమెరికా రక్షణాత్మక వాణిజ్య విధానాలపై చర్చించనున్న మోదీ, జింగ్‌పింగ్, పుతిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 24: అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానంపై చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌తో చర్చించాలని నిర్ణయించారు. ఈ వారం జపాన్‌లోని ఒసాకాలో జరి గే జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది. అలాగే ‘బ్రిక్స్’ గ్రూప్‌లో సభ్యులుగా ఉ న్న ఇతర దేశాధినేతలతో సైతం జింగ్‌పింగ్ చర్చలు జరుపనున్నారు. అమెరికా అనురిస్తున్న అనుచిత, రక్షణాత్మక వాణిజ్య వైఖరిని ఈ చర్చల సందర్భం గా ఈ మూడు దేశాల అధినేతలు వ్యతిరేకించే అవకాశాలున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాలైన బ్రెజిల్, ర ష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో బాటు రష్యా సైతం ఈ చర్చల్లో పాల్గొంటాయి. ఈనెల 28, 29 తేదీల్లో ఒసాకాలో ఈ జీ-20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఒకరోజు ముందే అక్కడికి చేరుకోనున్న చైనా అధ్యక్షుడు తొలుత లాంఛనంగా కొన్ని సమాశాల్లో పాల్గొంటారని, ట్రంప్‌తో సైతం కీలకంగా సమావేశమై వాణిజ్య పరమైన వైరుధ్యాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో ఇటీవల జరిగిన శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, గ్జీజింగ్‌పింగ్, పుతిన్ కలుసుకోవడం జరిగింది. అప్పటో లనే తదుపరి ఒసాకాలో జరిగే సదస్సులో చేపట్టాల్సిన చర్చపై నిర్ధారణకు వచ్చారని చైనా విదే శీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జుహాంగ్ జంగ్ తెలిపారు.