అంతర్జాతీయం

జీ-20 శిఖరాగ్రంలో.. ట్రంప్-మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 25: జపాన్‌లో ఈ వారం జరుగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సహా పలువురు ప్రపంచ నాయకులతో విడివిడిగా సమావేశం కానున్నారు. వాణిజ్యం సహా అనేక అంశాలపై ఆయన చర్చించనున్నారు. జపాన్‌లోని ఒసాకాలో ఈ నెల 28, 29 తేదీల్లో జరుగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ట్రంప్ ఈ నెల 27న బయల్దేరుతారు. ‘ఆయన (ట్రంప్) ప్రపంచ నాయకులతో పలు సమావేశాలలో పాల్గొంటారని మేము భావిస్తున్నాం’ అని ట్రంప్ పాలనాయంత్రాంగంలోని ఒక సీనియర్ అధికారి సోమవారం ఇక్కడ నిర్వహించిన ఒక ‘కాన్ఫరెన్స్ కాల్’లో విలేఖరులకు వివరించారు. జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఆయన విడిగా సమావేశం కానున్న నేతల్లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మన్ చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగాన్ ఉన్నారని ఆ అధికారి వివరించారు. భారత్‌లో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత మోదీ, ట్రంప్ సమావేశం అవుతుండటం ఇదే మొదటిసారి.
మోదీ రెండోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాక ట్రంప్ ఆయనకు ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. అమెరికా అల్యూమినియం, ఉ క్కు ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన తరువాత ప్రతిగా భారత్ బాదాములు, వాల్‌నట్‌లు సహా 28 ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచింది.
జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్‌పీ) కింద భారత్‌కు ఇచ్చిన ‘అభివృద్ధి చెందుతున్న దేశం లబ్ధిదారు’ హోదాను ట్రంప్ పాలనాయంత్రాంగం జూన్ ఒకటో తేదీన తొలగించింది.

చిత్రం... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ