అంతర్జాతీయం

పాక్‌లో ఆత్మాహుతి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 26: పాకిస్తాన్‌లో మరోసారి ఆత్మాహుతి దళాలు తెగబడ్డాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని లొరాలై జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లక్ష్యంగా బుధవారం మూడు ఆత్మాహుతి దళాలు దాడులకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరు మరణించగా.. నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఘటనకు ఎవరు బాధ్యులన్నది ఇంకా తెలియరాలేదు. తాలిబన్ రెబెల్స్ తరచు భద్రతా దళాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నాయని పోలీసులు వివరించారు. ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు ముగ్గురు ట్రైనింగ్ సెంటర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా.. ప్రవేశ గేటు వద్దే ఒకరిని కాల్చిచంపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు లోపలికి ప్రవేశించే ప్రయత్నంలో భద్రతాదళాలు కాల్పులు ప్రారంభించాయి. పరస్పర కాల్పుల్లో మరో ఆత్మాహుతి దళ సభ్యుడిని కాల్చి చంపగా.. మరో సభ్యుడు తనను తానే పేల్చివేసుకొన్నాడని ఆర్మీ తెలిపింది. బలూచిస్తాన్ ఐజీ మొహ్‌సిన్ హసన్‌భట్ మాట్లాడుతూ ఈ ఘటనలో గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు. దాడుల అనంతరం సంఘటన పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండి భారీ ప్రాణ నష్టం కలుగకుండా వ్యవహరించారని, ఇది అభినందనీయమని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి జాం కమల్‌ఖాన్ స్పష్టం చేశారు.