అంతర్జాతీయం

ఆర్థిక నేరస్థుల భరతం పట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా: విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులకు వ్యతిరేకంగా పోరాడాలని భారత్ పిలుపునిచ్చింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని ప్రపంచ వేదికలపైనా ఈ అంశాన్ని లేవనెత్తారని జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రభుత్వ షెర్పా (ప్రతినిధి) సురేశ్ ప్రభు శనివారం తెలిపారు. ‘పారిపోయిన ఆర్థిక నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించవలసిన అవసరాన్ని మేము గట్టిగా చెబుతూ వస్తున్నాం. ఇది పటిష్టమయిన అజెండా. మేము పన్ను ఎగవేత, అవినీతి, ఆర్థిక నేరాలు, దేశంనుంచి పారిపోయిన ఆర్థిక నేరస్థులకు వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నాం’ అని సురేశ్ ప్రభు ఇక్కడ మీడియా కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. జీ-20 సమావేశాలలోని చర్చల వివరాలను తెలియజేస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ అన్ని ప్రపంచ వేదికలపైనా ఈ అంశాలను లేవనెత్తారని ఆయన తెలిపారు. ‘ఆర్థిక నేరాలకు పాల్పడి తాము స్థిరనివాసం ఉన్న దేశం నుంచి పారిపోయిన వారికి వ్యతిరేకంగా గ్లోబల్ కమ్యూనిటీగా మనం ఐక్యంగా చర్య తీసుకోవలసిన అవసరం ఉందని మేము గట్టిగా అభిప్రాయపడుతున్నాం’ అని సురేశ్ ప్రభు జీ-20 సమావేశాలు ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. డిజిటల్ ఎకానమిపై ఒసాకా డిక్లరేషన్‌లో భారత్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించగా, దానికి కారణాలను జపాన్ ప్రధానమంత్రి షింజో అబేకు తెలియజేయడం జరిగిందని ఆయన బదులిచ్చారు. అయితే, భారత్ డిజిటల్ ఎకానమిని గట్టిగా విశ్వసిస్తోందని, తన డిజిటల్ అజెండాను ముందుకు తీసికెళ్లడంలో భాగంగా పెద్ద సంఖ్యలో బ్యాంకు ఖాతాలను తెరిపించడం సహా అనేక చర్యలు తీసుకుందని ప్రభు వివరించారు. ‘్భరత్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ విస్తృత కార్యక్రమాలు నిర్వహించింది. మేము పెద్ద సంఖ్యలో ప్రజలకు బ్యాంకు ఖాతాలను తెరిపించాం. అనేక లావాదేవీలు డిజిటల్ రూపంలో సాగుతున్నాయి’ అని ఆయన అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ తొలి టర్మ్‌లో రైల్వే మంత్రిగా పనిచేసిన సురేశ్ ప్రభు దేశంలోని రైల్వేల్లో ఏడాదికి సుమారు 8.1 బిలియన్ మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, వారిలో అనేక మంది డిజిటల్ వేదికల ద్వారా టికెట్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ‘మేమంతా డిజిటల్ వ్యవస్థను విశ్వసిస్తున్నాం. మేము ఈ- కామర్స్ మార్కెట్ సహా విస్తరిస్తున్న మార్కెట్‌ను కలిగి ఉన్నాం. అందువల్ల మేము డిజిటల్ ఆర్థిక వ్యవస్థను విశ్వసిస్తున్నాం. అదే సమయంలో తమ ప్రియమైన జపాన్‌తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాం. అయితే, మేము ఇదివరకే జపాన్‌కు కారణాలు తెలిపాం’ అని సురేశ్ ప్రభు అన్నారు.