అంతర్జాతీయం

ఫలవంతమైన చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా, జూన్ 30: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇక్కడ జరిగిన సమావేశంలో ఇరాన్, 5జీ, జాతీయ భద్రత తదితర అంశాలపై ‘్ఫలవంతమయిన చర్చలు’ జరిపారని ట్రంప్ కుమార్తె, అమెరికా అధ్యక్షుడి ఉన్నత స్థాయి సలహాదారు ఇవాంకా ట్రంప్ తెలిపారు. భారత్‌ను ఆమె అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామిగా, కీలక భద్రతా భాగస్వామిగా, కీలక మిత్రదేశంగా అభివర్ణించారు. జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా జపాన్‌లోని ఓడరేవు పట్టణం ఒసాకాలో మోదీ, ట్రంప్ విడిగా భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తరువాత ఈ ఇద్దరు నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి. జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాల చివరి రోజయిన శనివారం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఇవాంకా ట్రంప్ తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీతో, జపాన్ ప్రధాని షింజో అబేతో విడివిడిగా జరిపిన ద్వైపాక్షిక సమావేశాల సారాంశాన్ని వివరించారు. మహిళల ఆర్థిక అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన ఇవాంకా, అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా 5జీ టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజి, భద్రతపై దాని పర్యవసానాల గురించి ఇతర ప్రపంచ నాయకులతో జరిపిన ద్వైపాక్షిక సమావేశాలలో మాట్లాడారని తెలిపారు. ‘మేము ఒసాకాలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశాలలో ఉన్నాం. భారత ప్రధాన మంత్రి మోదీ, జపాన్ ప్రధానమంత్రి అబే అమెరికా అధ్యక్షుడితో 5జీ టెక్నాలజి, ప్రత్యేకించి భద్రతపై దాని పర్యవసానాలపై కేంద్రీకరించి జరిపిన చర్చలు ఇప్పుడే ముగిశాయి’ అని ఇవాంకా ఆ వీడియోలో పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ముఖాముఖి చర్చలు జరిగాయి. ఇవే అంశాలు వారి చర్చలలో ప్రస్తావనకు వచ్చాయి. కీలకమయిన వాణిజ్య భాగస్వామి, కీలకమయిన భద్రతా భాగస్వామి, కీలకమయిన మిత్రదేశం అయిన భారత్‌తో అమెరికా ఈ అంశాలపై చర్చించింది’ అని ఇవాంకా పేర్కొన్నారు. ట్రంప్-మోదీ సమావేశాన్ని ఆమె ‘్ఫలవంతమయిన చర్చలు’గా వ్యాఖ్యానించారు. ‘ఇవి ఒక ఫలవంతమయిన చర్చలు. ఇరాన్ మొదలుకొని జాతీయ భద్రత వరకు ప్రతి అంశాన్ని అమెరికా అధ్యక్షుడు, ప్రతినిధి బృందం భారత ప్రధానితో జరిపిన చర్చల్లో ప్రస్తావించారు’ అని 37 ఏళ్ల ఇవాంకా పేర్కొన్నారు.