అంతర్జాతీయం

విపత్తుల నిరోధానికి తక్షణ చర్యలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూదాబి, జూన్ 30: పర్యావరణానికి విఘాతం కలిగించే అంశాలపై తరచూ చర్చించడంతోపాటు విపత్తుల నిరోధానికి తక్షణం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటినియో గటరెస్ అన్నారు. ‘ఇపుడు మనం తీవ్రమైన వాతావరణ అనిశ్చితి పరిస్థితులను చవిచూస్తున్నాం’ అని అబూదాబిలో రెండు రోజులపాటు జరిగిన వాతావరణ సంబంధిత సమావేశాల్లో పాల్గొన్న ఐరాస సెక్రటరీ జనరల్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగే వాతావరణ చర్యల సదస్సు (సీఏసీ)లో ఇందుకు అనుగుణంగా ముందు కు సాగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. ఎంతోమంది అగ్రశ్రేణి శాస్తవ్రేత్తలు ఊహించిన దానికంటే త్వరితగతిన మార్పులు చోటుచేసుకుంటున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఇపుడున్నదానికంటే ఎక్కువగా వాతావరణంలో మార్పులు వేగం పుంజుకుంటున్నాయి. దీనిపై చర్చించేందుకు మనం ఇక్కడ భేటీ అయ్యాం’ అని ఐరాస చీఫ్ అన్నారు. ‘వాతావరణ సంబంధిత విధ్వంసాలు, వినాశనాలు, వరదలు, కరవు, వడగాలులు, అడవులు అంటుకోవడం, తుఫాన్లు వంటివి ఘటనలు ప్రపంచంలోని ఎక్కడో ఒకచోట నుంచి ప్రతివారం మన దృష్టికి వస్తున్నాయి’ అని ఆయన అన్నారు. అయితే, ఆయా అంశాలపై ఆశయం, అత్యవసరం అన్న ధోరణితో ప్రతిఒక్కరూ సమష్టిగా పనిచేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ కొంతమంది ప్రపంచానికి రాబోయే వాతావరణ ముప్పును సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ప్యారిస్ ఒప్పందంలో జరిగిన గ్లోబల్ వార్మింగ్‌లో చేసిన సూచనలు ఇపుడు ప్రపంచ మానవాళికి మేలు చేకూర్చగలవనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ శతాబ్దం ముగిసేనాటికి కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగే అవకాశాలను మనం చూస్తామని ఆయన పేర్కొన్నారు. ప్యారిస్‌లోని వాతావరణ చర్యల సదస్సులో జరిగిన ఒప్పందాలను అమలు చేసేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చిత్రం...వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సదస్సు ఆదివారం అబూదాబిలో ప్రారంభమైన సందర్భంగా
మాట్లాడుతున్న ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గటరెస్