అంతర్జాతీయం

అట్టుడికిన హాంకాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, జూలై 1: నిరసనకారులతో హంకాంగ్ మరోసారి అట్టుడికిపోయింది. హంకాంగ్ చైనా చేతుల్లోకి వెళ్లి 22 ఏళ్లయిన సందర్భంగా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఆందోళన కారులు శాసన సభలోకి చొచ్చుకెళ్లేందుకు విఫల యత్నం చేశారు. వందలాది మంది ముప్పేట దాడికి దిగారు. కొందరు విడిపోయి కార్గో వాహనంలో దూసుకొచ్చి భవనం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా భవనం అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ హఠాత్‌పరిణామంలో ప్రభుత్వ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. విక్టోరియా పార్క్ నుంచి ర్యాలీగా రావడానికి నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రదర్శనలను విరమించుకోవాలన్న అభ్యర్థను పట్టించుకోకుండా ముందుకు దూకారు. దేశం అప్పగింత చట్టాలను మార్చేసి సొంత విధానాల అమలుకు కుట్ర జరుగుతోందని చైనాపై నిరసనకారులు మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా యువత, పౌరులు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని కెర్రీ లామ్ స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించి సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఆమె చెప్పారు. కవెర్సౌస్ కనె్వన్షన్ సెంటర్ వద్ద నిరసనకారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.‘ప్రజల సమస్యల పరిష్కరించాలన్న చిత్తశద్ధి మా ప్రభుత్వానికి ఉంది. ప్రజల సెంటిమెంట్, వారి అభిప్రాయాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకుంటాం’అని భరోసా ఇచ్చారు. కాగా భద్రతాసిబ్బంది ప్రో డెమోక్రసీ సభ్యురాలు హెలీనా వాంగ్‌ను గది నుంచి బయటకు తోసివేశారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలని ఆమె బిగ్గరగా నినాదాలు చేశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ నిరసనకారుల తరఫున మాట్లాడాలంటే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. బదలాయింపుబిల్లు తమ ప్రాధమిక హక్కులను కాలరాసేదిగా ఉందని హంకాంగ్ పౌరులు అందోళన చెందుతున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ జూన్‌లో రెండు భారీ ర్యాలీ లు జరిగాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనకు ఉపక్రమించారు. బిల్లుపై పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నందున సభలో చర్చించకుండా నిరవధికంగా వాయిదా వేశారు. జూన్ 12న నిరసనకారులపై జరిగిన పోలీసు లాఠీ చార్జీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
చిత్రం...హాంకాంగ్ చైనా చేతుల్లోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం జరిగిన భారీ నిరసన ప్రదర్శన