అంతర్జాతీయం

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 1: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని సియాల్‌కోట్‌లో 500 ఏళ్ల చారిత్రక గురుద్వార క్షేత్ర ద్వారాలు భారతీయ సిక్కు యాత్రికుల కోసం సోమవారం తెరుచుకున్నాయి. లాహోర్‌కు 140 కిలోమీటర్ల దూరంలోని సియాల్‌కోట్ నగరంలో వెలసిన ఈ ‘బాబే-దే-బర్ గురుద్వార’లోకి గతంలో భారతీయులను అనుమతించేవారు కాదని పాక్‌పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని వివిధ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు భారత్‌తోబాటు పాకిస్తాన్, ఐరోపా, కెనడా, అమెరికా దేశాలకు చెందిన యాత్రికులు వస్తుంటారు. ఇకపై ఈ గురుద్వారకు సందర్శనకు సైతం భారతీయ సిక్కు యాత్రికులకు అవకాశం ఏర్పడింది. ఇక్కడికి ఇకపై భారతీయ సిక్కు యాత్రికులను సైతం అనుమతించాల్సిందిగా పంజాబ్ గవర్నర్ ముహమ్మద్ సన్వర్ ప్రావిన్స్‌కు చెందిన ‘కౌఖఫ్’ శాఖను ఆదేశించారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. గురు నానక్ జయంతి, వర్దంతి ఉత్సవాల సందర్భాల్లో భారత్ నుంచి ప్రతిఏటా వేలాది మంది సిక్కు యాత్రికులు పాకిస్తాన్‌కు తరలివస్తుంటారు. గురుద్వారలో జిన్ దేవ్‌జీ బలిదానాన్ని పురస్కరించుకుని జరిగే బెసాకీ ఉత్సవాలకు, మహారాజ రంజిత్ సింగ్ వర్దంతి పవిత్ర పూజలకు భక్తులు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
16వ శతాబ్ధంలో గురునానక్ సియాల్‌కోట్‌కు కాశ్మీర్ నుంచి వచ్చినపుడు బేరీలోని ఓ చెట్టుకింద ఆశీనులయ్యారని సిక్కు చరిత్రను బట్టి తెలుస్తోంది. ఆ ఘటనకు చిహ్నంగా ఇక్కడ సర్దార్ నతాసింగ్ ఇక్కడ గురుద్వార నిర్మించారు. కాగా పాకిస్తాన్ కర్తార్‌పూర్‌లోని గురుద్వార దర్బార్ సాహిబ్‌తోబాటు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో గురునానక్ సేదదీరిన డేరాబాబా నానక్ క్షేత్రాన్ని సందర్శించేలా సరిహద్దు దాటేందుకు పాక్‌స్తాన్ ప్రభుత్వం 2018 నవంబర్‌లో భారత ప్రభుత్వంతో అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే.