అంతర్జాతీయం

ఆవిష్కరణల కేంద్రంగా దుబాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూలై 3: ఆవిష్కరణలకు అతి పెద్ద కేంద్రంగా ఆవిర్భవించేందుకు దుబాయ్ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఇందుకు అనుగుణంగా భారత్‌లోని పారిశ్రామికవేత్తల వైపు ఇపుడు దృష్టి సారిస్తోంది. ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు తమ దేశంలో స్టార్టప్‌లు ప్రారంభించాలని కోరింది. ముఖ్యంగా సాంకేతికరంగంపై ఎక్కువగా దృష్టి సారించిన దుబాయ్ ఆ దిశగా స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా త్వరితగతిన లైసెన్సులు మంజూరు చేయడం, కార్యాలయాల ఏర్పాటుకు అనువైన వాతావరణ పరిస్థితులు కల్పించడంతోపాటు అవసరమైన నిధులను సమకూర్చేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. వాణిజ్య, వ్యాపార రంగాల్లో అగ్రస్థానంలో నిలిచేందుకు, ఆ తర్వాత నిర్మాణం, టూరిజం, తయారీ రంగాలపై దృష్టి సారించనుంది. ఇప్పటికే వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించడం ద్వారా 2018 సంవత్సరంలో 1.9 శాతం ఫలితాలు సాధించింది. 2010 నుంచి వివిధ రంగాల్లో అభివృద్ధి నెమ్మదిగా కొనసాగిస్తూ క్రమేణా పుంజుకుంటోంది. ‘విదేశీ స్టార్టప్‌లను ప్రారంభించే ముందు మా తొలి ప్రాధాన్యత భారత్. ఆ దేశం నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం ద్వారా మా కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిర్ణయించాం. దుబాయ్‌లో స్టార్టప్ హబ్‌లో భారత సంతితివారే 30 శాతం వరకు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు’ అని దుబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ నటాలియా సైచెవా తెలిపారు. ‘్భరత్‌పైనే మేము ఎక్కువగా బలమైన ప్రధాన దృష్టి సారించాం. భారతీయుల సత్తా వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో మా ఇంక్యుబేటర్లు ఇప్పటికే గ్రహించారు’ అని ఆమె పేర్కొన్నారు. తమ చాంబర్ దుబాయ్‌లో స్టార్టప్ హబ్‌లను ప్రారంభించేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి స్టార్టప్‌లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించిందని ఆమె తెలిపారు. దుబాయ్‌లో తమ వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తృతం చేసే దిశగా వందలాది స్టార్టప్‌లను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. బ్లాక్ చెయిన్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వంటి రంగాలపై దృష్టి సారించే కంపెనీల వైపు దృష్టి సారించామని ఆమె తెలిపారు. కొత్త కొత్త స్టార్టప్‌లు ఏర్పాటు చేయడం వల్ల ఈకామర్స్, నిర్మాణం, లాజిస్టిక్, రిటైల్ విభాగాల్లో ఆశాజనకమైన ఫలితాలను ఆశించవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. గతనెలలో భారత్‌లోని బెంగళూరు, ఢిల్లీలో తమ హబ్‌ల ఆధ్వర్యంలో రోడ్‌షోలు నిర్వహించడం ద్వారా ఎక్కువ సామర్థ్యం గల స్టార్టప్‌లను గుర్తించగలిగామని ఆమె పేర్కొన్నారు. దుబాయ్‌లో అతి పెద్ద రెండో వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలుస్తోంది. ఇందులో భాగంగా 31.4 బిలియన్ల మేరకు ఇంధనేతర రంగాల్లో జరిగిన ద్వైపాక్షిక వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు సాగించింది.