అంతర్జాతీయం

బలూచిస్థాన్ ఉగ్రవాద సంస్థే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/ఇస్లామాబాద్, జూలై 3: పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఉగ్రవాద సంస్ధేనని అమెరికా ప్రకటించింది. ఇటీవల గ్వాదర్ పోర్టు సిటీలో ఐదు నక్షత్రాల హోటల్‌పై బీఎల్‌ఏ దాడి చేసిన సంగతి తెలిసిందే. 2006 సంవత్సరంలో పాకిస్థాన్ ప్రభుత్వం బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని నిషేధించింది. బిఎల్‌ఏను నిషేధించాల్సిందిగా పాక్ ప్రభుత్వం ఇదివరకే అమెరికాను కోరింది. ఇటీవల బీఎల్‌ఏ పాల్పడిన దురాగతంతో అమెరికా కూడా అడుగు ముందుకేసింది. పాక్‌లో నిషేధిత బీఎల్‌ఏ ఉగ్రవాద సంస్థ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బలూచీ ప్రాంతంలో భద్రతా దళాలపై దాడులతు పాల్పడుతోంది. కొన్ని సమయాల్లో పౌరులపైనా దాడులకు దిగింది. అమెరికాలో ఎవరైనా బీఎల్‌ఏకు సహకరించినా, ఆర్థిక సహాయం అందజేసినా క్షమించేది లేదని అమెరికా హెచ్చరించింది. బీఎల్‌ఏ గత ఏడాది పలు విధ్వంసాలకు పాల్పడింది. గత ఏడాది ఆగస్టులో బలూచిస్థాన్‌లోని చైనా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అదే ఏడాది కరాచీలోని చైనా కౌన్సులేట్‌పై దాడి, ఈ ఏడాది మేలో గ్వాదర్‌లోని విలాసవంతమైన హోటల్‌లో దాడికి దిగింది. గ్వాదర్‌లోని హోటల్‌లో జరిగిన ఈ దాడిలో ఐదుగురు యాత్రికులు, పాక్‌కు చెందిన సైనికుడు మృత్యువాతపడ్డారు. ఇలాఉండగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీపై అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ప్రభుత్వం స్వాగతించింది.