అంతర్జాతీయం

నాపై ఉన్నవన్నీ అక్రమ కేసులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: తనపై ఉన్నవన్నీ అక్రమ కేసులేనని లిక్కర్ కింగ్ విజయ్ మాల్య అన్నారు. భారత్‌లో సుమారు 9 వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి, లండన్ పారిపోయిన మాల్యను తమ కు అప్పగించాలని భారత ప్రభుత్వం చాలా కాలంగా కోరుతున్నది. దీనిపై బ్రిటీషు కోర్టు స్పందిస్తూ మాల్య భారత్‌కు వెళ్ళాల్సిందేనని తీర్పునిచ్చింది. కాగా ఈ తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి యూకే హైకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వుపై మాల్ప స్పందిస్తూ తాను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని అన్నారు. భారత్‌లో సీబీఐ తనపై అక్రమ కేసులు బనాయించిందని ఆయన ట్వీట్ చేశారు. బకాయిలను తీర్చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తాను ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేశానని మాల్య అన్నారు. అయితే సీబీఐ, ఇతర ప్రభుత్వ శాఖలు తనపై కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌కు వెళితే తనకు ప్రాణ హానీ ఉన్నట్లు మాల్య చెప్పారు. ఉద్యోగులు, రుణ దాతలు చెల్లించిన మొత్తాలను ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఇలాఉండగా మాల్యను భారత్‌కు అప్పగించాల్సిందేనని కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై మరోసారి విచారణ జరగాలని యూకే హైకోర్టు భావిస్తోంది. కింది కోర్టు లేవనెత్తిన పలు అంశాలపై సమాధానాలు ఇచ్చే అవకాశాన్ని మాల్యకు కల్పించాలని అభిప్రాయపడింది. ఈ కారణంగానే కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తాను నిర్దోషినంటూ పేర్కొంటున్న మాల్య భారత్‌కు రావడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వయంగా రక్షణ విషయంలో హామీ ఇచ్చినప్పటికీ స్వదేశానికి రావడానికి సానుకూలంగా లేని మాల్య కోర్టును ఆశ్రయిస్తున్నారు.