అంతర్జాతీయం

ఆకాశంలో భారీ ఉల్కాపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 8: ఈ వారంలో ఆకాశం ఉల్కాపాతంతో కాంతులు విరజిమ్ముతుందని నాసా శాస్తవ్రేత్తలు వెల్లడించారు. గంటకు 200 ఉల్కలు భూవాతావరణాన్ని తాకుతాయని, దాదాపు గంటపాటు కాంతి వర్షాన్ని కురిపిస్తాయని నాసా పేర్కొంది. ఆగస్ట్ 11-12 తేదీలలో ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా శాస్తవ్రేత్త బిల్ కూక్ పేర్కొన్నారు. కచ్చితమైన పరిస్థితుల్లో గంటకు 200 ఉల్కల చొప్పున భూవాతావరణాన్ని తాకుతాయన్నారు. 2009లో ఇలాంటి అద్భుతం జరిగిందని, ఇప్పుడు మళ్లీ దీన్ని చూడవచ్చని ఆయన అన్నారు. ప్రతి ఉల్క తోకచుక్కలోని ఒక చిన్న భాగమని ఆయన తెలిపారు.
సూర్యుడి కక్ష్యలో 133 ఏళ్లకోసారి తిరిగే తోకచుక్క సౌర వ్యవస్థలో ట్రిలియన్లకొద్దీ ముక్కలను వదిలేస్తుందని.. ఈ ముక్కలు భూ వాతావరణాన్ని తాకినప్పుడు పెద్ద ఎత్తున వెలుగు వర్షం కురుస్తుందన్నారు. ‘‘దాదాపు 45నిమిషాల పాటు మీ కళ్లను చీకటికి అలవాటు చేయండి. నేరుగా ఆకాశంలోకి ఉల్కాపాతాన్ని చూడండి’’ అని బిల్ పేర్కొన్నారు. ఈ ఉల్కలు సెకన్‌కు 59కిలోమీటర్ల వేగంతా విస్తరిస్తూ వెళ్తాయని, అవి భూవాతావరణాన్ని తగిలినప్పుడు 1600 నుంచి 5500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడుతుందని, భూపరితలంపై 80 కిలోమీటర్ల మేర మండుతుందని దానివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా వెల్లడించింది.