అంతర్జాతీయం

దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదయింది. అంతకు ముందు రోజే సంభవించిన భారీ భూకంపంతో అతలాకుతలమయిన ప్రజలను ఈ తాజా భూకంపం మరింత దెబ్బతీసింది. సహాయక సిబ్బంది, భద్రతా బలగాలు శనివారం తెల్లవారు జామున భూకంప కేంద్రం ఉన్న ప్రాంతానికి వెళ్లాయి. లాస్ ఏంజిల్స్‌కు ఈశాన్యం దిశగా సుమారు 150 మైళ్ల (240 కిలో మీటర్ల) దూరంలో జనసాంద్రత తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉంది. శుక్రవారం సాయంత్రం తరువాత సంభవించిన ఈ భూకంపం కారణంగా ఎవరూ మృతి చెందలేదు.
ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. అయితే, పలు భవనాలు కూలిపోయినట్టు, ట్రోనా పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు కాలిఫోర్నియా ఎమర్జెన్సీ సేవల కార్యాలయం డైరెక్టర్ మార్క్ ఘిలర్‌డుక్కి తెలిపారు. అయితే గ్యాస్ లీకీజీల కారణంగా మంటలు లేచిన సంఘటనలు చాలా చోట్ల జరిగాయని, అలాగే విద్యుత్, నీటి సరఫరాలు నిలిచిపోయాయని, ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నాయని ఆయన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఎమర్జెన్సీ ఫెడరల్ సహాయం కావాలని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్‌ను కోరినట్టు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తెలిపారు. గవర్నర్ తరువాత సాన్ బెర్నార్‌డినో కంట్రీలో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. అంతకు ముందే ఆయన కెర్న్ కంట్రీలో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. ఈ వారంలో సంభవించిన రెండు భూకంపాల కేంద్రాలకు ఇది సమీపంలో ఉంది. సుమారు 200 మంది భద్రతా సిబ్బంది సహా ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్‌ను, ఒక హెలిక్యాప్టర్‌ను, ఒక కార్గో విమానాన్ని సహాయక చర్యల నిర్వహణ కోసం రంగంలోకి దింపినట్టు నేషనల్ గార్డ్ మేజర్ జనరల్ డేవిడ్ బాల్డ్‌విన్ తెలిపారు.

చిత్రం...భూకంప తాకిడికి యూకా వ్యాలీలోని ఓ వాల్మార్ట్ కేంద్రంలో కిందపడిపోయిన వస్తువులు