అంతర్జాతీయం

ఇండోనేసియాలో భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా: ఇండోనేసియాలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నార్త్ సులవెసి, నార్త్ మలుకు మధ్య మలుక్కా సముద్రంలో ఈ భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. 24 కిలో మీటర్ల లోతున భూకంపం ఏర్పడిందని తెలిపింది. ఈ భూకంపం కారణంగా సునామీ సంభవించే ప్రమాదం ఉందని ఇండోనేసియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సమీపంలోని తీర ప్రాంత వాసులను హెచ్చరించింది. భూకంపం తీవ్రతకు భయంతో జనం ఇళ్లనుంచి బయటకు పరుగులుతీశారు. ప్రకంపనల వల్ల ఆస్తినష్టం కానీ, ప్రాణనష్టం కానీ జరిగినట్టు ఎలాంటి వార్తలు వెలుగులోకి రాలేదు. అయతే కొన్నిచోట్ల దీనివల్ల నష్టం కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.