అంతర్జాతీయం

అది భారత్-పాక్‌ల వైఫల్యమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, జూలై 8: కాశ్మీర్ పరిస్థితిని మెరుగు పరచడంలో భారత్-పాకిస్తాన్‌లు విఫలం అయ్యాయని ఐక్య రాజ్యసమితి వ్యాఖ్యానించింది. గతంలో లేవనెత్తిన అనేక సమస్యలను నివృత్తి చేసేందుకు ఈ రెండు దేశాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపింది. కాశ్మీర్ పరిస్థితికి సంబంధించి ఇరుదేశాలను తప్పుబడుతూ గత ఏడాది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ ఓ నివేదిక జారీ చేశారు. తక్షణ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఉద్రిక్తతలను సడలించాలని రెండు దేశాలకు విజ్ఞప్తి చేశారు. కానీ, ఇప్పటి వరకు భారత్-పాక్‌ల పరిస్థితిని మెరుగుపరచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఐక్యరాజ్యసమితి తాజాగా తన మానవ హక్కుల నివేదికలో స్పష్టం చేసింది. 2018 మే నుంచి 19 ఏప్రిల్ వరకు కాశ్మీర్‌లోనూ, ఆక్రమిత కాశ్మీర్‌లోనూ అట్టడుగు స్థాయిలు పౌర మరణాలు సంభవించాయని తెలిపింది. అయినప్పటికీ కూడా ఇరుదేశాల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా కాశ్మీర్‌లో భద్రతా దళాల చర్యలపై ఎలాంటి జవాబు దారీతనం లేకుండా పోయిందని తెలిపింది.