అంతర్జాతీయం

ఐసిస్ స్థాపకుడు ఒబామాయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబియా జిల్లా, ఆగస్టు 11: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థను స్థాపించిందే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అని అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్‌డేల్‌లో బుధవారం నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ అధ్యక్షుడు ఒబామాను గౌరవిస్తోందని అన్నారు. ‘ఆయనే వ్యవస్థాపకుడు. ఆయన ఐఎస్‌ఐస్‌ను స్థాపించారు’ అని ఒబామాను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్‌పైనా ట్రంప్ విరుచుకుపడ్డారు. ఐఎస్‌ఐఎస్ సహ వ్యవస్థాపకురాలు కుటిలబుద్ధి గల హిల్లరీ క్లింటన్ అని ఆయన ఆరోపించారు. ‘సహ వ్యవస్థాపకురాలు కుటిలబుద్ధి గల హిల్లరీ క్లింటన్ అని నేను చెప్పదలచుకున్నాను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. బుధవారం అంతకుముందు హిల్లరీ క్లింటన్ కూడా ట్రంప్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని ఆమె ట్రంప్‌ను తీవ్రంగా హెచ్చరించారు.