అంతర్జాతీయం

భారత్ ఫైటర్ జెట్లను ఉపసంహరించుకుంటేనే మా విమాన మార్గాన్ని తెరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 12: బాలాకోట్‌కు సమీప సరిహద్దుల్లో గగనతలంలో తిరుగుతున్న భారతీయ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు అక్కడి నుంచి వైదొలగేంత వరకు తమ వాణిజ్య విమానాలకు సంబంధించిన మార్గాన్ని తెరిచేది లేదని శుక్రవారం నాడిక్కడ పాకిస్తాన్ విమాన యాన సంస్థ కార్యదర్శి షారుక్ నుస్రత్ ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీకి నుస్రత్ సమాచారమిచ్చారు. భారతీయ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ శిక్షణ శిబిరంపై దాడులు నిర్వహించిన అనంతరం గత ఫిబ్రవరి 26 నుంచి పాకిస్తాన్ ఆ ప్రాంతంలోని విమాన మార్గాన్ని పూర్తిగా మూసివేసింది. కాగా ఆ మార్గంలో సంచరిస్తున్న భారత్ ఫైటర్ జెట్లను అక్కడి నుంచి ఉపసంహరించుకోవాల్సిందిగా ఇప్పటికే భారత్‌కు చెందిన అధికారులను కోరామని పౌర విమాన యాన సంస్థ (సీఏఏ) డైరెక్టర్ బాధ్యతలు సైతం నిర్వహిస్తున్న నుస్రత్ శుక్రవారం విమానయాన సంస్థకు చెందిన సెనేట్ స్టాండింగ్ కమిటీకి తెలియజేశారు. భారత విమాన ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశం తమ విజ్ఞప్తిపై స్పందించాలన్నారు. ఈ విమాన మార్గాన్ని తెరవాలని భారత్‌కు చెందిన అధికారులు కోరారని, దీనిపై పాక్ వైఖరిని తెలియజేశామని నుస్రత్ కమిటీకి వివరించారు. బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం ఇలా పాక్‌కు చెందిన ఓ అధికారి బహిరంగ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఈ భారతీయ ఎయిర్ స్పేస్‌ను పూర్తిగా మూసివేసినప్పటి నుంచి ఈ మార్గంలో థాయ్‌ల్యాండ్ నుంచి ప్రయాణించాల్సిన పాకిస్తాన్ విమానాల రాకపోకలను సైతం ఆపివేశారు. అలాగే మలేషియాకు వెళ్లాల్సిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానాలు ఆగిపోయని సీఏఏ డీజీ కమిటీకి వివరించారు.