అంతర్జాతీయం

చక్కెర ఉత్పత్తి, వాణిజ్యంలో భారత్ బాధ్యతా రాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జూలై 12: చక్కెర ఉత్పత్తి, వాణిజ్యం విషయంలో భారత్‌తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను కోరింది. ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశంగా పేరెన్నికగన్న భారత్ చక్కెర ఉత్పత్తి, వాణిజ్యం విషయంలో బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని, ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి నిగ్గుదేల్చాలని ఆస్ట్రేలియా డబ్ల్యూటీవోను కోరినట్టు శుక్రవారం నాడిక్కడ వెలువడిన ఓ మీడియా కథనాన్ని బట్టి స్పష్టమవుతోంది. ఈ విషయమై గత మార్చిలో ఆస్ట్రేలియా, బ్రెజిల్ దేశాలు ఏకమై భారత్‌కు వ్యతిరేకంగా డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేయడం జరిగింది. చెరుకు రైతులకు వరుసగా సబ్సిడీలు ప్రకటిస్తున్న భారత్ వైఖరి వల్ల అంతర్జాతీయంగా చక్కెర ధరలపై భారం, వత్తిడి నెలకొంటున్నాయని ఆ రెండు దేశాలతోబాటు గువాటెమాలా ఈ సందర్భంగా ఆరోపించాయి. ఆస్ట్రేలియా ఆర్థిక నివేదిక మేరకు ఆ దేశపు వాణిజ్య మంత్రి సైమన్ బర్మింగ్‌హాం ఈ అంశంపై మాట్లాడుతూ ‘ఆస్ట్రేలియాతో భారత్‌కు దీర్ఘ కాలంగా ఉన్న చక్కెర వాణిజ్య సమస్యను పరిష్కరించుకునే దిశగా నిర్థిష్టమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదని, పైగా సబ్సిడీల కేటాయింపును కొనసాగిస్తూనే ఉంద’ని వ్యాఖ్యానించారు. దీనివల్ల ఆస్ట్రేలియాలో చెరుకు పండించే రైతులు, కూలీలు, మిల్లర్లపై ప్రభావం పడుతోందని, ఈ దిశలో ప్రాంతీయంగా ఉద్యోగాల కల్పనకు సైతం ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాకు భారత్‌తో మంచి ద్వైపాక్షిక బంధాలున్నాయని అవి కొనసాగాలంటే డబ్ల్యూటీవో కలుగజేసుకుని వాణిజ్యపరమైన సమస్యలను పరిష్కరించాలని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి బ్రిడ్గెట్ మెకన్జీ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో చక్కెర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న 40 వేల మంది ఉద్యోగులు, ప్రాంతీయ కమ్యూనిటీల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం నెలకొందన్నారు. కాగా ఆస్ట్రేలియా ప్రతిఏటా 2 బిలియన్ డాలర్ల విలువైన చక్కెరను ఎగుమతి చేస్తోంది. ఈ క్రమంలో ఈ వాణిజ్యాన్ని మరింత పటిష్టవంతం చేసుకునే దిశగా భారత్‌పై ఆరోపణలకు దిగింది.