అంతర్జాతీయం

భారత్‌లో పేదరికం తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూలై 12: భారత్‌లో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయా? అంటే ఐక్యరాజ్యసమితి ఔననే చెబుతోంది. విభిన్న కోణాల్లో నిర్వహించిన పేదరిక సర్వే సూచీ మేరకు భారత్‌లో దాదాపు 271 మిలియన్ల మంది జనాభా పేదరికం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఆస్తులు, వంట ఇంధనం, శానిటేషన్, పోషకాలు తదితర కోణాల్లో నిర్వహించిన సర్వే మేరకు భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గింది. యూఎన్‌డీపీ, ఓపీహెచ్‌ఐలు 101 దేశాలపై అధ్యయనం నిర్వహించగా ఇందులో భారత్‌లో పేదరికం చాలావరకు తగ్గుముఖం పట్టినట్లు తేలింది. వీటిలో తక్కువ ఆదాయంలో 31 దేశాలుండగా.. మధ్యతరగతిలో 68, అధికాదాయంలో రెండు దేశాలు ఉన్నట్లు స్పష్టమైంది. పేదరికం అన్నది కేవలం ఆదాయం, అనారోగ్యం కారణాలతో ముడిపెట్టలేమన్న అంశాన్ని అధ్యయనం పేర్కొంది. పది దేశాల్లోని రెండు బిలియన్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడినట్లు అధ్యయనం చెబుతోంది. ఈ దేశాల్లో భారత్ ఒకటి కాగా.. బంగ్లాదేశ్, కాంబోడియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, హైతీ, నైజీరియా, పాకిస్తాన్, పెరు, వియత్నాంలు ఉన్నాయి. ప్రతి కోణంలోనూ అధ్యయనం చేసిన మేరకు ఈ దేశాల్లో పేదరికం సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. ఒక్క భారత్‌లో 2006 సంవత్సరంలో ఉన్న పేదరికానికి 2016లో ఉన్న పేదరికానికి చాలా వ్యత్యాసం కనపడింది. దాదాపు 271 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు అధ్యయనం చెబుతోంది. మొత్తంగా చూస్తే భారత్‌లో 2005-06లో 0.283గా ఉన్న పేదరిక సూచీ 2015-16లో 0.123గా నమోదైంది. పేదరికం తగ్గిందనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు అవసరం ఏమీ లేదని చెప్పొచ్చు. అత్యంత పేదరికాన్ని ఎదుర్కొన్న ప్రాంతాల్లో శరవేగంగా పేదరికం నుంచి బయడపడ్డ రా ష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటి అని తేలింది. ఇక్కడ 2005-06లో 74.9 శాతం పేదరికం ఉండగా 2015-16లో 46.5 శాతానికి చేరింది. మొత్తమీద భారత్‌లో 2005-06 సంవత్సరంలో 640 మిలియన్ల మంది ప్రజలు (55.1శాతం) పేదరికంలో ఉండగా.. 2015-16లో ఈ సంఖ్య 369 మిలియన్ల (27.9 శాతం)కు తగ్గిందని ఐక్యరాజ్యసమితి అధ్యయనం స్పష్టం చేసింది. అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడం వల్లే పేదరిక శాతం తగ్గినట్లు చెప్పవచ్చు. 2005-06, 2015-16 మధ్య వివిధ కోణాల్లో చేసిన పేదరిక సూచీ వివరాలు ఇలా ఉన్నాయి. పోషకాలు, శానిటేషన్, శిశు మరణాలు, తాగునీరు, స్కూళ్లకు వెళ్లే వారు, విద్యుత్, స్కూళ్లలో అటెండెన్స్, హౌసింగ్, వంట ఇంధనం, ఆస్తులు తదితర అంశాలపై ఐక్యరాజ్య సమితి అధ్యయనం చేసింది. ఈ రంగాల్లో సాధించిన ప్రగతి కారణంగానే భారత్‌లో పేదరికం సంఖ్య బాగా తగ్గినట్లు తెలుస్తోంది.