అంతర్జాతీయం

విదేశాల్లోనూ వెల్లివిరిసిన దేశభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్/వాషింగ్టన్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతటా భారతీయుల్లో దేశభక్తి భావం వెల్లివిరిసింది. జాతీయ పతకావిష్కరణలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సోమవారం వారు 70వ స్వాతంత్య్ర దిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమాలు జరిగాయి. స్వదేశంలో స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న ప్రజలకు తోడుగా పాకిస్తాన్, చైనా, అమెరికా, బ్రిటన్, థాయిలాండ్, సింగపూర్ తదితర అనేక దేశాల్లోని భారతీయులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ దేశభక్తి గీతాలాపనలు, వివిధ రకాల సాంస్కృతి, నృత్య ప్రదర్శనలతో హోరెత్తించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో స్వాతంత్య్ర దిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలే ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో హైకమిషన్ సిబ్బందితోపాటు మన దేశం నుంచి వెళ్లిన ముగ్గురు పార్లమెంట్ సభ్యులు దేవ్‌జీ మాన్‌సింగ్రామ్ పటేల్, అలోక్ తివారీ, కలికేశ్ నారాయణ్ సింగ్ దేవ్ పాల్గొన్నారు.
చైనా రాజధాని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దిన వేడుకల్లో అక్కడి భారత రాయబారి విజయ్ గోఖలే త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా రాయబార కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. రాయబార కార్యాలయ సిబ్బందితోపాటు చైనాలోని భారతీయులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే షాంఘైలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ప్రకాష్ గుప్తా, గాంగ్జూలోని భారత కాన్సులేట్‌లో కాన్సల్ జనరల్ వైకె.సైలాస్ తంగల్ మువ్వనె్నల జెండాలను ఆవిష్కరించారు. అమెరికాలో భారతీయులు అధిక సంఖ్యలో నివసిస్తున్న ఫెర్మాంట్ (కాలిఫోర్నియా), ఎడిసన్, న్యూజెర్సీ, డాలస్, హ్యూస్టన్, చికాగో, ఓర్లాండో, మినె్నపోలిస్ తదితర ప్రాంతాల్లో స్వాతంత్య్ర దిన వేడుకలు ఎంతో కన్నుల పండువగా జరిగాయి. బ్రిటన్‌లో జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో బాలీవుడ్ గాయకుడు రహత్ ఫతే అలీ ఖాన్, అక్కడి భారత మహిళా కళాకారిణుల బృందం తమ ఆట పాటలతో అందరినీ ఎంతగానో అలరించారు.