అంతర్జాతీయం

భారీ తుపాన్లతో లూసియానా భయకంపితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్రాకోస్టల్ సిటీ (అమెరికా), జూలై 14: భారీగా తుపానులు విరుచుకుపడుతున్న లూసియానాలోని బార్రీ ప్రాంతాన్ని భారీ వర్షాలు, టోర్నడోలు తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశాలున్నాయని శనివారం అధికారులు హెచ్చరించారు. అట్లాంటిక్ సముద్రం వైపు నుంచి విరుచుకుపడిన తొలి హరికేన్ లోతట్టు ప్రాంతమైన బార్రీని ముంచెత్తినప్పటికీ భూమి కోతలు ఏర్పడినప్పటికీ ఇన్‌ల్యాండ్ వైపు మళ్లిపోవడంతో నష్టం పెద్దగా వాటిల్లలేదు. అతిపెద్ద నగరం న్యూ ఓర్లీన్స్ విమానాశ్రయానికి విమానాల రాకపోకలన్నీ రద్దయ్యా యి. వేలాది మంది తమ ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా బంద్ అయింది. దీంతో అధికారులు సహాయక చర్యలకు ఉపక్రమించారు. సైనికాధికారులు, ఇంజనీర్లు భరోసా ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఇందోళన తగ్గింది. అయితే మేయర్ లాటోయా కాంట్రెల్ మాత్రం తమ అసహాయతను వ్యక్తం చేశారు. ఆదివారం సైతం వరదలు ముంచెత్తే అవకాశాలున్నందువల్ల ఇళ్లు ఖాళీ చేసిన వారు సురక్షిత ప్రాంతాల్లో ఉండటమే మంచిదని ఆమె సూచించారు. ఇదే రకమైన ఆందోళనను లూసియానా గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ సైతం వ్యక్తం చేశారు. శనివారం పగటిపూట కంటే రాత్రి పూటే వర్ష బీభత్సం జరిగిందని ఆయన చెప్పారు. రాత్రి 10 గంటల సమయంలో తుపాను 50 మైళ్ల వేగంతో గంటపాటు విరుచుకుపడిందని జాతీయ హరికేన్ కేంద్రం తెలిపింది. ఒక్క రోజులోనే 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, దక్షిణ లూసియానా పరిసరాల్లో నదులన్నీ పొంగిపొర్లుతున్నాయని ఏఎఫ్‌టీ విలేఖరి తెలిపారు.

చిత్రం... ఇంట్రాకోస్టల్ నగరంలో ఇళ్లలోకి చేరిన వరద నీరు