అంతర్జాతీయం

ఇండోనేసియాలో భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా : ఇండోనేసియాలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేసియాలోని మారుమూల మాలుకు ద్వీపకల్పంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై 7.3గా నమోదయింది. భూకంపం వల్ల భయకంపితులయిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వీధుల్లోకి పరుగులు పెట్టారు. అయితే, అధికారులు సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. ఉత్తర మాలుకు ప్రావిన్స్‌లోని టెర్నేట్ పట్టణానికి దక్షిణ, నైరుతి దిశల మధ్యలో 165 కిలో మీటర్ల దూరంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6.28 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూఉపరితలానికి పది కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.