అంతర్జాతీయం

దేశంలో పెరిగిన ఊబకాయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూలై 16: భారత్‌లో తినడానికి తగినంత తిండిలేని వారి సంఖ్య తగ్గగా, ఊబకాయుల సంఖ్య పెరిగింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్ల మంది ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారని కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఐరాస అనుబంధ విభాగలయిన యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), ద ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (ఐఎఫ్‌ఏడీ), ద యూఎన్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సంయుక్తంగా సోమవారం ఇక్కడ ఈ నివేదికను విడుదల చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా 2018వ సంవత్సరంలో 82కోట్ల మంది ప్రజలకు తినడానికి తగినంత తిండి లేదని అంచనాకు వచ్చినట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే వీరి సంఖ్య పెరిగింది. 2017లో తినడానికి తగినంత తిండి లేని వారి సంఖ్య 81కోట్ల 10 లక్షలు ఉండింది. ఏడాది కాలంలో వీరి సంఖ్య 90 లక్షలు పెరిగింది. వీరి సంఖ్య పెరుగుతుండటం ఇది వరుసగా మూడో సంవత్సరం. 2030 నాటికి ప్రపంచంలో ఆకలితో అలమటించే వారి సంఖ్యను సున్నాకు తగ్గించాలని పెట్టుకున్న ‘స్థిరమయిన అభివృద్ధి లక్ష్యాని’కి పెరుగుతున్న ఈ సంఖ్య పెను సవాలునే విసురుతోంది. భారత్‌లో 2004-06లో తినడానికి తగినంత తిండిలేని వారి సంఖ్య 25కోట్ల 39లక్షలు ఉండగా, 2016-18 నాటికి 19కోట్ల 44 లక్షలకు తగ్గిందని ఐరాస నివేదిక వెల్లడించింది. అయితే, 18సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయసు గల పెద్దవారిలో ఊబకాయుల సంఖ్య 2012లో 2కోట్ల 41లక్షలు ఉండగా, 2016 నాటికి 3కోట్ల 28లక్షలకు పెరిగిందని నివేదిక వివరించింది.