అంతర్జాతీయం

ఐదు బౌద్ధ విగ్రహాలు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాట్మండు, జూలై 18: బౌద్ధుల పుణ్యభూమిగా భావించే నేపాల్ దేశంలో జరగకూడని విధ్వంసమే జరిగింది. బౌద్ధులు ఆరాధ్యదైవంగా భావించే బుద్ధుడికే కొంతమంది అపచారం తలపెట్టారు.
బుద్ధుడు జన్మించిన లుంబినీ సమీపంలోని ఘోరం చోటుచేసుకొంది. గుర్తు తెలియని కొంతమంది దుండగులు ఐదు బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రాజధాని కాట్మండూకి 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుంబినీ సమీపంలోని తిలోత్తమ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఇక్కడి శంకర్‌చౌక్ సమీపంలోని బుద్ధుడు కూర్చొని ఉండే పొజిషన్‌లో ఉన్న విగ్రహాలను సిమెంట్, సున్నపురాయి, ఇసుక మిశ్రమంతో ఈ విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో విగ్రహం 120 కిలోల బరువు ఉండే విధంగా వీటిని నిర్మించారు. ఈ విధ్వంసాన్ని చూస్తుంటే మత సామరస్యానికి భంగం వాటిల్లే విధంగా ఉందని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులపై కఠినంగా శిక్షించాలని నేపాలీ కాంగ్రెస్ నాయకుడు బాలకృష్ణ ఖండ్ డిమాండ్ చేశారు. ఘటనపై అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించిందని తిలోత్తమ మేయర్ వసుదేవ్ ఘిమ్రే స్పష్టం చేశారు.