అంతర్జాతీయం

భారత్‌తో నేపాల్ సంబంధాలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాట్మండు, జూలై 19: ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి ఉన్న భారత్ నుంచి అధిక శాతం లబ్ధి నేపాల్ కూడా పొందుతోందని అక్కడి భారత రాయబారి మంజీవ్ సింగ్ పూరి స్పష్టం చేశారు. భారత్-నేపాల్ సంబంధాలు.. అభివృద్ధి తదితర అంశాలపై శుక్రవారం జరిగిన సెమినార్‌లో పూరి మాట్లాడారు. భారత్ నుంచి పర్యాటకులు, విదేశీ పెట్టుబడులే ప్రధాన వనరుగా నేపాల్ అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి నేపాల్‌కు ప్రకృతిపరంగా ఎంతో లాభం చేకూరిందని ఆయన పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక వృద్ధి నిలకడగా కొనసాగుతోందనీ, విదేశీ పెట్టుబడుల రూపంలో నేపాల్ కూడా భారత్ నుంచి లబ్ధి పొందాలని ఆయన కోరారు. 2025 నాటికి ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వృద్ధి పొందే దిశగా భారత్ అడుగులు వేస్తోందనీ.. ఒక పొరుగు దేశంగా నేపాల్ కూడా దీని నుంచి లబ్ధి పొందగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావలి మాట్లాడుతూ భారత్‌తో సత్సంబంధాలు బాగానే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో జరిగే నష్టాల శాతం తగ్గే విధంగా ఇరు దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, సున్నితమైన సరిహద్దు, జల వివాదాలు పరిష్కారమైతే ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయనీ, ఇందుకు భారత్ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేపాల్ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి నేపాల్ మాజీ ప్రధాన మంత్రి మాధవ్ నేపాల్ విశేష కృషి చేశారని గ్యావలి వెల్లడించారు. బౌద్ధ, హిందూ మతాలకు పుట్టినిల్లుగా భావించే నేపాల్ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.