అంతర్జాతీయం

రష్యాతో భారత్ ఒప్పందం అమెరికాకు ఇబ్బందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 20: రష్యాతో గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకోవడం అమెరికాకు ఇబ్బందికరమైన అంశమేనని ఇండో-పసిఫిక్ కమాండర్ ఫిలిప్ డేవిడ్‌సన్ స్పష్టం చేశారు. ఎస్-400 రక్షణ వ్యవస్థను కొనేందుకు రష్యాతో భారత్ సుమారు 40,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తామని, రష్యాతో ఒప్పందం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్య తలెత్తదని భారత్ ఇది వరకే ప్రకటించింది. అయితే, ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఒరిగేది ఏమీ లేదని, రష్యా రక్షణ వ్యవస్థ అంత గొప్పదేమీ కాదని మాజీ దౌత్యవేత్త నిక్ బర్న్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అమెరికా-్భరత్ మధ్య పౌర అణు ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన బర్న్స్ పలు అంశాలను ప్రస్తావించారు. అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ అత్యంత బలమైనదనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలనే వినియోగిస్తున్నారని తెలిపారు. భారత్‌తో చిరకాలంగా అమెరికాకు ఉన్న మైత్రీ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కాగా, బర్న్స్ వ్యాఖ్యలపై అడ్మిరల్ డేవిడ్‌సన్ స్పందించారు. రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాను ఇబ్బంది పెట్టే అంశమేనని తేల్చిచెప్పారు. అయితే, ఈ అంశంపై భారత్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. భారత్ అలీన విధానం ఎంతో గొప్పదని, దశాబ్దాల కాలంగా అదే పంథాను అనుసరిస్తున్నదని డేవిడ్‌సన్ అన్నారు. అందుకే, రష్యాతో రక్షణ వ్యవస్థకు సంబంధించిన అంగీకారం కుదరడంపై అమెరికా ఆందోళనకు గురవుతున్నదని వివరించారు. గత ఏడాది సాంకేతిక, మేధా సంపత్తి ఇచ్చిపుచ్చుకునే విషయంలో అమెరికా, భారత్ మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారత్‌తో రక్షణపరమైన అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు. అమెరికాలో తయారవుతున్న సీ-17 విమానాల కొనుగోలుదారుల్లో భారత్ అతి పెద్దదని తెలిపారు. ఒకప్పటి సోవియట్ యూనియన్‌తో స్నేహ సంబంధాలతో, తమతో ఉన్న మైత్రికి మధ్య వ్యత్యాసాన్ని భారత్ గ్రహించే ఉంటుందని వ్యాఖ్యానించారు. రష్యాతో రక్షణ వ్యవస్థ ఒప్పందంపై తాము భారత్‌తో చర్చలు జరుపుతామని, సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని డేవిడ్‌సన్ అన్నారు.