అంతర్జాతీయం

మానవ హక్కుల ముసుగులో ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 16: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి మానవ హక్కుల ముసుగు వేసుకునే దేశాలు తీవ్రమైన నయవంచకులని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ పరోక్షంగా పాక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదమే మానవ హక్కులకు అతి పెద్ద శత్రువని, అన్ని మతాలు సమానవైనవని, ఏ మతం కూడా మిగతా మతాలకన్నా ఎక్కువ కాదని నమ్మే దేశం భారత్ అని అన్నారు.
70వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొనడం కోసం న్యూయార్క్ వచ్చిన అక్బర్ ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ, అమానుషమైన ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కోసం మానవ హక్కులనే ముసుగును ఉపయోగించుకునే దేశాలు అన్నిటికన్నా అత్యంత నయవంచక దేశాలని సోమవారం భారత కాన్సులేట్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మాట్లాడుతూ అక్బర్ అన్నారు. అలాంటి భావన కారణంగానే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిందని, ఇప్పుడు బలూచిస్తాన్ నివురుగప్పిన నిప్పులా రగులుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. మానవ హక్కులకు నిజమైన ప్రతినిధి భారత దేశం అని, మానవ హక్కులకు అన్నిటికన్నా అతి పెద్ద శత్రువు ఉగ్రవాదం, ఉగ్రవాదులేనన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. భారతీయ ముస్లింనని చెప్పుకోవడానికి తాను గర్విస్తున్నానని అక్బర్ అన్నారు.

చిత్రం..ఎంఎస్ సుబ్బులక్ష్మి స్మారకార్థం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్